ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షల విరాళం
రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్
హైదరాబాద్, మార్చి1 (విజయక్రాంతి): ఎంతో పురాతనమైన శ్రీసిద్ధి వినాయక స్వామి ఆలయం అభివృద్ధి కోసం రాజ్ కుమార్ ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు విరాళంగా అందజేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ కాల్వ గడ్డ రాజ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.సొంత గ్రామమైన పఠాన్‌చెరు నియోజకవర్గం, ముత్తంగి డివిజన్, కర్ధనూర్ గ్రామంలోని శ్రీసిద్ధి వినాయక స్వామి ఆలయం ఎంతో పురాతనమైనది, వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోక శిదిలావస్థకు చేరుకన్నదన్నారు.
ఆలయ పునర్నిర్మాణం చేయడానికి దాతల కోసం ఆలయ సిబ్బంది, గ్రామస్థులు ఎంతమందిని కలుస్తున్నా పెద్దగా స్పందన లభించకపోవడంతో తమ ఫౌండేషన్ ద్వారా ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తక్షణమే ఆలయ పనులు మొదలు పెట్టాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులకు రాజ్ కుమార్ సూచించారు.




