2 March, 2026 | 12:02 PM

విద్యా వ్యవస్థపై కుట్రలు

02-03-2026 01:46 AM
  1. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చెత్తబుట్టలోకి విద్యా కమిషన్ రిపోర్టు 
  2. బీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): రెండేళ్ల రెండు నెలల రేవంత్‌రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ మీద కుట్రలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మూడు రో జుల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎంకు విద్యా విధానం మీద నివేదిక ఇచ్చారని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యాకమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేస్తామని స్పష్టం చేశారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. ఈ రిపోర్టులో ఉపాధాయ్యుల ఆత్మగౌరవం దెబ్బ తీసే ప్రయత్నం జరిగిందని, లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డా రు. ఒళ్లంతా విషం నింపుకుని ఆకునూరి మురళి ఈ రిపోర్ట్ తయారు చేశారని విమర్శించారు. లక్షా 70 వేల మంది ఉపాధ్యా యులకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏ మాత్రం సమీక్షించకుండా పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవ స్థ భ్రష్ఠు పట్టిందని మురళి ఎలా అంటారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్‌తో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారని, ఇపుడు విద్యాకమిషన్ రిపోర్ట్‌తో కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బ తీసే కుట్ర చేశారని ఆరోపించారు. విద్యావ్యవస్థకు రాజకీయాలు జత చేయొద్దని మురళి అంటూనే కేసీఆర్‌ను ఎందుకు విమర్శిస్తున్నారని ప్ర శ్నించారు. ఉపాధ్యాయుల జీతాలు పెంచకుండా రేవంత్‌రెడ్డి విద్యా కమిషన్‌తో రిపో ర్టు ఇప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఉపాధ్యాయులకు టెస్టులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని మురళి రిపోర్టు ఇచ్చారని, మరి ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్రమోషన్లకు టెస్ట్ లు వద్దా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇష్టం లేకనే విద్యా కమిషన్ ద్వారా ఆ మాట చెప్పించారని విమర్శించారు. డిగ్రీ గురుకులాలు రద్దు చేయమంటున్నారని, ఇంత కన్నా దారుణమైన చర్య ఉంటుందా..

పేద విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలు పెట్టారనే విష యం మరచిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళికి కోపం ఉంటే మమ్మల్ని కాల్చాలని, పేద కుటుంబాల మీద ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. నేషనల్ ఎ డ్యుకేషన్ పాలసీని విద్యా కమిషన్ కాపీపేస్ట్ చేసిందని ఆరోపించారు. ఈ కమిషన్ రిపో ర్టు అమలయితే తెలంగాణ విద్యావ్యవస్థ వెనక్కి పోవడం ఖాయమని తెలిపారు.