2 March, 2026 | 8:42 AM

గుజరాత్ పాల మోడల్ భళా

02-03-2026 01:48 AM
  1. పాల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తాం

రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): పాల ఉత్పత్తిలో గుజరాత్ మోడల్ బాగుందని, ఇది తెలంగాణకు అవసరమని పశు సంవవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు. తెలంగాణను పాల ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా నిలుపుతామని మంత్రి స్ప ష్ట్రం చేశారు. గుజరాత్‌లో పాడి పరిశ్రమ అ భివృద్ధి విధానాలను అధ్యయనం చేయడానికి మంత్రి శ్రీహరి బృందం ఆదివారం ఆ రాష్ట్రంలో పర్యటించింది. మంత్రి బృందానికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) చైర్మన్ డాక్టర్ మీనేష్ షా బృందం ఘనస్వాగతం పలికింది.

ఈ సందర్భంగా అమూల్ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలు, పాల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలపై మంత్రి బృందానికి డాక్టర్ మీనేష్ షా, అధికారులు వివరించా రు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గుజరాత్‌లో అమూల్ మోడ ల్ ద్వారా సాధించిన విజయాలు తెలంగాణకు ప్రేరణగా నిలుస్తాయన్నారు.

తెలంగాణ లో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు.  పాల ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతికత వినియోగం, సహకార వ్యవస్థ బలోపేతం, రైతులకు మెరుగైన ధరలు అం దించే దిశగా గుజరాత్ అనుభవాలను తెలంగాణలో అమలు చేయాలన్నారు. మంత్రి వాకిటి బృందంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.