3 June, 2026 | 4:07 PM

నూతన ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వద్దు

03-06-2026 03:24 PM

- డిటిఎఫ్  నాయకుల డిమాండ్

ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం  చేస్తామని ప్రకటించినందున  నూతన ప్రైవేటు  విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వద్దని  డిటిఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులో  నిర్వహించనున్న ర్యాలీ ధర్నాకు సంబంధించిన  పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి  బుడుగు శామ్యూల్ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో  విద్యారంగానికి 15% నిధులు  కేటాయిస్తామని ప్రకటించినందున  విద్యారంగానికి కావలసిన నిధులు కేటాయించాలని అన్నారు.

విద్యారంగం పటిష్టం కావడానికి  కేంద్ర ప్రభుత్వం 10%, రాష్ట్ర ప్రభుత్వం 20% నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో  టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని  నియమించాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను  సెమీ రెసిడెనిషియల్ స్కూల్స్ గా ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్,ప్రైవేట్  విధానంలో స్కిల్ ఇండియా పాఠశాలలు  ఏర్పాటు చేస్తామంటూ, యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామంటూ  ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ఆలోచన చేయడం సరైంది కాదన్నారు. పాఠశాలల్లో అమలవుతున్న  మధ్యాహ్న భోజన పథకం అమలులో  స్వచ్ఛంద సంస్థలకు పాత్రలు కల్పించడం సరైనది కాదని  ఇది చూస్తుంటే ప్రభుత్వం తప్పుకునే విధంగా చూస్తుందని ప్రజలు భావిస్తారు అన్నారు.

పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెడతామని ప్రకటిస్తున్న ప్రభుత్వం  ఉత్తీర్లైన శి క్షణ పొందిన  ఉపాధ్యాయులను నియమించాలన్నారు. ప్రభుత్వ విద్య పటిష్టత విస్తరణకై పోరాడుదాం, విద్యా ప్రైవేటీకరణను, కార్పొరేట్ కర్ణను  ప్రతిఘటనజలానికి  శుక్రవారం హైదరాబాదులోని సుందరయ్య పార్క్ నుండి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ  నిర్వహించి ధర్నా నిర్వహిస్తామన్నారు. వేలాది స్కూల్ లను నిర్వీర్యం చేసి మూసివేయడానికి దారి తీసే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ల స్థాపన మానుకోవాలని, పాఠశాలల పర్యవేక్షణకు  అధికారులను నియమించాలని, ఎంఈఓ, డిఇఓ  పోస్టులను భర్తీ చేయాలని, డైట్, బీఈడీ కాలేజీలలో, ఎస్సీఈఆర్టీ  లో ఖాళీగా ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని  అన్నారు. ర్యాలీ ధర్నాను విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చక్రం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చంద్రబాన్, జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ ప్రకాష్, సభ్యులునాతారి రమేష్,సి.వీరయ్య, కైలాస్ తదితరులు పాల్గొన్నారు.