25 June, 2026 | 3:36 AM

యూనిఫామ్స్ పంపిణీ

25-06-2026 12:00 AM

వెల్దుర్తి, జూన్ 24 : మండల పరిధిలోని శేరిలా గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్లు దేవలత, లక్ష్మి, స్థానిక సర్పంచి లావణ్య, ఉపసర్పంచి బత్తుల నవీన్ లా చేతుల మీదుగా ఏకరూప దుస్తువులను అందజేశారు. అనంతరం అక్షరాభ్యాస, అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు,, ఏకరూప దుస్తువులు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. అంగన్వాడికి వచ్చే చిన్నారులకు ఏకరూప దుస్తులు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

ఉప సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులు ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ఏకరూప దుస్తులతో రావడం అందరూ సమానమే భావన చిన్ననాటి నుండే మొదలవుతుందని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో అందజేసే పోషకాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.