విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ
తాడ్వాయి, ఆగష్టు 14 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో శుక్రవారం బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ రామస్వామి మాట్లాడుతూ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఎం ఎం ఎస్ స్టడీ మెటీరియల్, గోల్డెన్ స్టార్ అవారడ్స్ బ్యాడ్జీలు,స్టీల్ ప్లేట్లు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సంస్థ తరఫున ఫౌండర్ చాంద్ పాషా కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు 15 మందికి నాలుగు వేల విలువైన స్టడీ మెటీరియల్ ఒక్కొక్కరికి అందించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కో తరగతిలో పది మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డెన్ స్టార్ అవారడ్స్ 50 బ్యాడ్జీలు, 50 స్టీల్ ప్లేట్లు బహుమతులుగా అందించారు.
ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ చాంద్ పాషా కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిగ్ హెల్ప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చాంద్ పాషా, కామారెడ్డి జిల్లా జోనల్ డైరెక్టర్ హేమంత్ కుమార్, స్థానిక సర్పంచ్ సుమలత రామరాజు, ఏ ఏ పీ సి చైర్మన్ హేమలత, వార్డు సభ్యులు నరేష్, గిర్మబోయి తదితరులు పాల్గొన్నారు.






