21న పీఈ సెట్ సీట్ల కేటాయింపు
15-08-2026 01:36 AM
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్ చివరి విడత సీట్లను ఈ నెల 21న కేటాయించనున్నారు. శుక్రవారంతో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఈ నెల 22 నుంచి 27 వరకు రిపోర్టింగ్ చేయాలి.
ఎల్‌ఎల్‌ఎం కౌన్సిలింగ్ రీషెడ్యూల్..
ఎల్‌ఎల్‌ఎం కౌన్సిలింగ్ ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు. ఈ నెల 19 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లకు గడువు ఈ నెల 21 వరకు కాగా, 23న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 27 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.






