వైభవంగా అమ్మవార్ల ఆలయాల వార్షికోత్సవం
ఘట్ కేసర్, ఆగస్టు 14 (విజయక్రాంతి): పోచారం డివిజన్ పరిధి, అన్నోజిగూడ లోని శ్రీనల్ల పోచమ్మ, మహంకాళమ్మ, ఎర్ర పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్ల ఆలయాల నాలుగో వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
ఈ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవార్లు శాకాంబరీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా, గణపతి పూజ, పుణ్యవాహచనం, మండపారాధన, మహాపూర్ణాహుతి, అశీర్వచనం, తీర్థప్రసాద వితరణలతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మాజీ ఛైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ రెడ్యానాయక్, సాయిరెడ్డి, లక్ష్మీ శేఖర్, ఆలయ కమిటీ ఛైర్మన్ యాదగిరి, వైన్ ఛైర్మన్ భాస్కర్ గౌడ్, డైరెక్టర్లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






