విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
శంకర్‌పల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రా ణించాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలోని ప్రాథ మికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ చిట్టపు శేఖర్ తో కలిసి ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని వసతులను కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రైవేటు పాఠశాలలు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నడిచేందుకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించి అన్ని వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు కూడా శక్తి వంచన లేకుండా విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌండ్రసత్యం, నాయకులు వెంకటేష్ ముదిరాజ్, వేణు, ఆదం , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






