17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇంటర్ విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ

25-02-2026 12:36 AM

ఎర్రుపాలెం ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మండల కేంద్రమైన ఎర్రుపాలెం కస్తూర్బా గాంధీ పాఠశాల నందు విద్యనభ్యసిస్తున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 80 మంది విద్యార్థులకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు.

రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వల వీరయ్య మాట్లాడుతూ నేటి నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు, మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా నాయకులు పడిగల నాగేశ్వరరావు, రిటైర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ పొట్టపెంజర మోహన్ రావు లోటస్ హాస్పిటల్ జే వెంకన్న బాబు గార్ల ఆర్థిక సహాయంతో ఎ ఫాట్ స్పెన్సు పంపిణీ చేస్తున్నామని ఇంటర్మీడియట్ కు హాజరవుతున్న వేలాదిమంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ ప్రజా సంఘాల నాయకులు నల్లమోతు హనుమంతరావు, ఆంగోతు వెంకటేశ్వర్లు, దూదిగం బసవయ్య, గామాసు జోగయ్య, దివ్వెల వీరాంజనేయులు, పాఠశాల ఎస్హెచ్‌ఓ సరిత,అరుణా ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.