11 May, 2026 | 10:14 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఎమ్మెల్యే చే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

23-02-2026 09:28 PM

మండలంలోని  162 మందికి రూ. 1 కోటి 62 లక్షల ఆర్థిక సాయం అందజేత

కుభీర్,(విజయక్రాంతి): ఆడబిడ్డల పెండ్లిల్లు చేసిన లబ్ధిదారులు ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 162  మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష 116 చెక్కులను ఆయన  అందజేశారు.

ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా దశలవారీగా అన్ని సమస్యలను నెరవేర్చేందుకు తలవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శివరాజ్, స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్, ఆత్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ లు సిద్ధం వార్ వివేకానంద, గోనే కళ్యాణ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు.