11 May, 2026 | 9:10 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

విద్యార్థుల పరీక్ష ఫీజులు చెల్లించిన సంజయ్ దాస్ గౌడ్

23-02-2026 09:32 PM

చిట్యాల,(విజయక్రాంతి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో  10వ తరగతి విద్యార్థులందరి పరీక్ష ఫీజును తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సోమవారం చెల్లించారు. సమాజ సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడు ముందుండే ఆయన మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పరీక్ష ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పదోవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను ఆయన స్వయంగా చెల్లించారు.

విద్యార్థుల భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉంటుందని, డబ్బుల కొరత వల్ల ఎవరూ చదువు ఆపకూడదని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఇకమీదట ప్రతి సంవత్సరం పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులకు తానే ఫీజులు చెల్లిస్తానని  సంజయ్ దాస్ గౌడ్  తెలిపారు. ఈ కార్యక్రమలో ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల, పీ.ఆర్.టి.యు రాష్ట్ర నాయకులు బాదం బిక్షపతి తెలంగాణ ఉద్యమ నాయకులు జోగు లింగస్వామి, జిట్ట మల్లేష్, ఉపాధ్యాయులు చెలకరాజు శ్రీనివాస్, నర్రా సరళ తదితరులు పాల్గొన్నారు.