రామన్నగూడెం తండాలో ఘనంగా శీతల పండగ
07-07-2026 08:50 PM
నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రామన్నగూడెం తండాలో వర్షాకాలం రాగానే మొదటగా గిరిజనులు తమ వ్యవసాయ భూముల్లో విత్తనాలు విత్తి, పశుపక్షాదుల, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, గిరిజన కుటుంబాలన్నీ ఊరి చివర గల గుడి వద్దకు చేరుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం నైవేద్యాలు సమర్పిస్తారు. నూతన గిరిజన దుస్తులను ధరించి, ఆనందంగా గడుపుతారు. ఈ కార్యక్రమంలో తండా గిరిజన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






