7 July, 2026 | 10:21 PM

పంచాయతీ నిధుల లెక్క చెప్పండి

07-07-2026 08:52 PM

రాజాపూర్: రాజాపూర్ గ్రామపంచాయతీకి సంబంధించి అభివృద్ధి సమస్యల పరిష్కారం విషయంలో సర్పంచ్ వార్డు సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని మంగళవారం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి 12 మంది వార్డు సభ్యులు గైరాజరయ్యారు. జనవరి 2026 నుండి ఏప్రిల్ నెల వరకు గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయో లెక్కలు చెప్పాలని పంచాయతీ కార్యదర్శి కి వార్డు సభ్యులు అందరూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వార్డులలో ఏ ఏ పనులకు ఎన్నో నిధులు కేటాయించారో తమకు తెలుపాలని కోరారు. ఏవైనా గ్రామం  సమస్యలు ఉన్న సర్పంచ్ రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులను కలుపుకొని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.