30 May, 2026 | 4:28 AM

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

30-05-2026 12:00 AM

కుబీర్ మే 29 (విజయ క్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో షాదీ ముబారక్ కళ్యా ణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రామారావు పటేల్ శుక్రవారం పంపించేశారు. మొత్తం 80 మందికి చెక్కులను అందించారు. పెళ్లి చేసిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

కొనుగోలు కేంద్రం ప్రారంభం 

కుబీర్ మండల కేంద్రంలో శుక్రవారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రా మారావు పటేల్ ప్రారంభించారు. యాసంగిలో జొన్న పంట సాగు చేసే రైతులకు మ ద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు ఉన్నారు.