పెన్‌గంగా నదిలో బాలుడి మృతి
30-05-2026 12:00 AM
బేల, మే 29 (విజయక్రాంతి) : కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి బోనం వేయడానికి వెళ్ళిన బాలుడు నదిలో పడిపో యి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బేల మండల కేంద్రంకు చెందిన బేతం సాయి దీప్ (13) అనే బాలుడు పెన్ గంగా నది లో ప్రమా దవశాత్తు మునిగి మృతి చెందిడు.
బేల కు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సాంగిడి గ్రామ సరిహద్దులోని పెన్ గంగా నది కి బలి గంగమ్మ తల్లికి బోనం వేశారు. ఇదే క్రమంలో బేతం సాయి దీప్ అనే బాలుడు నది లో ప్రమాదవశాత్తు పడి నీటిలో మునిగి మృతి చెందాడు. మృతదే హాన్ని పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ రిమ్స్ కి ఆస్పత్రి మార్చురీకి తరలించారు.






