6 April, 2026 | 10:35 PM

బొల్లారం గ్రామంలో కబడ్డీ డ్రెస్ కోడ్ పంపిణీ

06-04-2026 08:36 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామంలో బీజేపీ నాయకురాలు కొండ మీరాతాయి ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారులకు డ్రెస్ కోడ్‌ను పంపిణీ చేశారు.యువత మత్తుకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని ఉద్దేశంతో ఈకార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. క్రీడల ద్వారా యువత ఆరోగ్యంగా ఉండడంతో పాటు మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూత్ అధ్యక్షులు మేదర్ సత్యం, కల్లంపేట సంతోష్, క్రీడాకారులు చిట్టిబాబు, బాబు, కృష్ణ, కుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.