26 June, 2026 | 1:49 AM

శామీర్‌పేట్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ

26-06-2026 12:25 AM

శామీర్ పేట్, 25 జూన్ (విజయక్రాంతి): మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జిల్లా ఆర్టిఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్ పేట్ డివిజన్ లో ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ చీరలను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.... మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి బాలేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, డ్వాక్రామహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.