15 July, 2026 | 1:02 AM

అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ

15-07-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, జూలై 14 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలోని ఏడు గుళ్ల ఆలయం వద్ద అమావాస్య సందర్భంగా శ్రీపాద వల్లభ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గుప్తా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి నెల అమావాస్య రోజున మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

నేటి సమాజంలో ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదని శ్రీపాద వల్లభ ట్రస్ట్ లక్ష్యంగా ముందుకు కొనసాగుతుందని రమేష్ గుప్తా వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఆర్ మల్లికార్జున స్వామి.నరసింహులు పటేల్.శేఖర్ పటేల్, కార్తీక్ రెడ్డి, మధు, ఓంకార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.