28 May, 2026 | 2:31 AM

అవార్డ్స్ వేడుకలకు డీజీపీకి ఆహ్వానం

28-05-2026 01:32 AM

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): నగరంలో జూలై మొదటి వారంలో జరగనున్న ’రైజింగ్ తెలంగాణ సీఎస్‌అర్ అవారడ్స్’ వేడుకలకు తెలంగాణ డీజీపీ సీ.వి.ఆనంద్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్లు నారి నిర్మాణ్ సీఈఓ, వేడుకల నిర్వాహకుడు జగన్నాథం మాదిరెడ్డి బుధవారం బషీర్ బాగ్ లో మీడియాకు తెలిపారు.

అయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, యువత సాధికారత, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ అవార్డ్సో్ల యువ పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, సామాజిక సేవకులు, వివిధ రంగాల ప్రతిభావంతులను సత్కరించనున్నట్లు తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో హధ్యాస్ మీడియా డైరెక్టర్ పవన్ కుమార్, అరుణ్, ఆర్పీఐ నేత పేరం శివ నాగేశ్వర్ రావు గౌడ్, మహిళా నాయకురాలు గంగాపురం పద్మావతి లు ఉన్నారు.