28 May, 2026 | 2:31 AM

బాల్క సుమన్‌ను అరెస్టు చేయాలి

28-05-2026 01:34 AM

డీజీపీకి బల్మూరు, అద్దంకి ఫిర్యాదు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజలను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వ విప్‌లు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్‌లు డీజీపీని కోరారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని బుధవారం డీజీపీకి కలిసి ఫిర్యాదు చేశారు.    మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి బాల్క సుమన్‌ది నేర ప్రవృత్తి అన్నారు.

ధా న్యం కొనుగోళ్ల విషయంలో రైతుల ముసుగులో ఉన్నది బీఆర్‌ఎస్ నేతలేనని, ప్రజా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర పనుతున్నారని ఆయన మండిపడ్డారు.  ఉద్య మ సమయంలోనూ ఎంతో మంది ఉసురుపోసుకున్నారని, శవాల మీద పేలాలు ఏరుకు నే రాజకీయం బీఆర్‌ఎస్ నేతలదని బల్మూర్ దుయ్యబట్టారు.

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఆస్తులను తగులబెట్టే కుట్ర చేస్తున్నారని, టెర్రరిస్టులా బాల్క సుమన్ మాట్లాడారని, ఆయన వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేసీఆర్, కేటీఆర్‌లు మౌనంగా ఎందుకున్నారని బాల్కసుమన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బల్మూరు, అద్దంకి డిమాండ్ చేశారు.