30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మూడు రోజుల్లో తాత్కాలికంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు డీజీపీ హామీ

04-05-2026 10:01 AM

.రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

బోథ్(విజయ క్రాంతి): గత కొన్ని రోజులుగా బోథ్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాల వల్ల రైతుల సాగు చేసుకున్న పంటలు బూడిద పాలు అవుతున్నాయని అందుకు తక్షణమే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆదివారం సాయంత్రం సంబంధిత డిజిపి విక్రమ్ సింగ్ ను కోరారు  ఈ మేరకు ఆయన విజయ క్రాంతి తో మాట్లాడుతూ జరిగిన నష్టం విషయమై ఆయన వివరించడం జరిగింది అన్నారు

తక్షణమే తాత్కాలికంగా నాయనా అగ్నిమాపక కేంద్రాన్ని బోత్ లో ఏర్పాటు చేయాలని కోరమన్నారు .స్పందించిన డిజిపి ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు .చేతికందేపంట కండ్ల ముందు కాలిపోతుంటే రైతులకు తీరని దుఃఖంతో ఉన్నారని ఆయన వాపోయారు. ప్రభుత్వం తక్షణమే రైతన్న ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.  కష్టాల్లో ఉన్న రైతన్నను ఆదుకునేది రాజకీయం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. రైతన్న కుటుంబాలకు పార్టీలకతీతంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు