30 June, 2026 | 11:27 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

టీఆర్ఎస్ బలోపేతంపై దృష్టి పెట్టాలి

04-05-2026 09:59 AM

కవితను కలిసిన జిల్లా అధ్యక్షుడు వినోద్

వాంకిడి (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరిమిల్ల వినోద్ చారి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయికి తీసుకెళ్లి ప్రతి గడపకూ పార్టీ సిద్ధాంతాలను చేరవేసే దిశగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమమే పార్టీ ప్రధాన ఎజెండా అని వినోద్ చారి స్పష్టం చేశారు. కవిత నాయకత్వంలో జిల్లాలోని ప్రతి మండలంలో పార్టీని బలోపేతం చేసి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను చేపడతామని వెల్లడించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కవిత సూచించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కావేటి సబిత మనోహర్, మొహమ్మద్ మౌసిన్, నర్సింగోజు సాయి కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.