‘నాచగిరి’కి పోటెత్తిన భక్తులు
18-05-2026 02:05 AM
గజ్వేల్ మే 17: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నాచగిరిలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి బెల్లంకొండ రంగాచారి పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.






