18 May, 2026 | 3:04 AM

ప్రైవేటు వద్దు.. ‘సర్కారు’ ముద్దు!

18-05-2026 02:04 AM
  1. సత్ఫలితమిస్తున్న బడిబాట
  2. కూతుర్ని ప్రభుత్వ బడిలో చేర్పించిన సర్పంచ్
  3. సర్కార్ బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల నమోదు

కరీంనగర్, మే 17 (విజయ క్రాంతి): జి ల్లాలో నిర్వహిస్తున్న విద్యా వాహిని బడిబాట కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా ఇన్చార్జి వి ద్యాశాఖ అధికారి అశ్విని తానాజీ వాకడే మార్గదర్శకత్వంలో గంగాధర మండలంలో నిర్వహిస్తున్న విద్యా వాహిని బడి బాట కా ర్యక్రమం ప్రభుత్వ విద్యపై గ్రామాల్లో కొత్త నమ్మకాన్ని పెంచుతోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి చే స్తున్న కృషి గ్రామాల్లో విద్యాపట్ల చైతన్యాన్ని తీసుకువస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే అభ్యసించారని ప్రస్తావించారు. అలాగే గంగాధర ఎ మ్మార్వో, ఎంపీడీవో, ఎస్త్స్ర వంటి అధికారు లు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ స్థాయికి చేరుకున్నారని ప్రజలకు వివరిస్తూ తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచుతున్నారు. గ్రామ సభలు, ఇంటింటి ప్రచార కార్యక్రమా ల్లో తల్లిదండ్రులకు అధికారులు ఒక ప్రేరణాత్మక సందేశాన్ని ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాచిరెడ్డిపల్లి సర్పంచ్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన కుమార్తెను కార్పొరేట్ పాఠశాల నుండి తీసివేసి ప్ర భుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్ర భుత్వ బడులపై ముందుగా మనకే నమ్మకం ఉండాలి అనే బలమైన సందేశాన్ని సమాజానికి అందించారు. గ్రామాల్లో కార్పొరేట్ విద్యపై ఎక్కువ ఆకర్షణ ఉన్న సమయంలో, ఒక ప్రజాప్రతినిధి స్వయంగా తన కుటుంబంతో ప్రభుత్వ విద్యను నమ్మి ముందుకు రావడం చర్చనీయాంశమైంది.

ఈ నిర్ణయం వల్ల అనేక మంది తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులవుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. గత 15 రోజులుగా ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు గంగాధర మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో విద్యా వాహిని బడి బాట కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. అవగాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే విశేష ఫలితాలను ఇస్తోంది.

ర్యాలపల్లి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 17 నుండి 75కు పెరిగింది. కొండయ్యపల్లి పాఠశాలలో నమోదు 28 నుండి 85కు చేరింది. మండలంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ స్వంత ఖర్చులతో విద్యా వాహిని వాహనాన్ని ఏర్పాటు చేసి దాదాపు 23 వేల రూపాయల వరకు వ్యయం చేసింది.

ప్రజాప్రతినిధులు ముందుకు రావడం వల్ల పాఠశాలలపై నమ్మకం పెరుగుతుంది

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సమగ్ర అభివృ ద్ధికి అవసరమైన అన్ని అవకాశాలు అం దుబాటులో ఉన్నాయి. గంగాధర్ మం డలంలో విద్యావాహిని బడిబాట కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ప్రజాప్రతినిధులు ముందుకు రావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోంది.

ఏనుగు ప్రభాకర్ రావు, మండల విద్యాధికారి