18 May, 2026 | 3:03 AM

మాకేదీ గుర్తింపు..?

18-05-2026 02:06 AM
  1. పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఎక్కడ..?
  2. కాంగ్రెస్ పార్టీ గుర్రుగా పాత క్యాడర్ 
  3. పార్టీ , నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే17(విజయ క్రాంతి):ప జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి నివురు గప్పిన నిప్పుల ఉంది. పార్టీ సంస్థ కథ నిర్మాణంలో భాగంగా మం డల , మున్సిపల్ అధ్యక్ష పదవుల కేటాయింపుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాత క్యాడర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ము ఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన మండల అధ్యక్షుల నియామకాలు పార్టీ పాత పార్టీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి. పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదనే భావన క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది.

ఏకపక్షంగా నియామకాలా..?

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసులు, ఒత్తిడులు ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి.. ఇటీవల ఇతర పా ర్టీల నుంచి చేరిన వారికే పదవులు, ప్రాధాన్యత కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తు న్నాయి. గ్రామ, మండల స్థాయిలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వకుండా కొందరు నాయకులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇటీవల సిర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు,

ఒక ము న్సిపాలిటీకి అధ్యక్షులను ప్రకటించడంతో ఈ అసంతృప్తి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మండల స్థాయి సమావేశాలు నిర్వ హించకుండా అధ్యక్షుల ఎంపిక జరగడం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. 2023 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ జెండా పట్టుకొని పనిచేసిన వారికి కాకుండా కొత్తగా చేరిన వారికే పదవులు దక్కుతున్నాయనే అభిప్రాయం పాత పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

కొత్తవారికే ప్రాధాన్యత..?

జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లోనూ పాత కార్యకర్తలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని, పార్టీ,నామినేటెడ్ పదవులు కూడా కొత్తగా చేరిన నాయకులకే పరి మితమవుతున్నాయనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల పంపిణీ కూడా ఇదే విధంగా ఉంటుందన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీని బలోపేతం చేయడంలో వెనుకడుగు వేయలేదని కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.

అలాంటి సమయంలో పార్టీకి దూరంగా ఉన్న వారు ఇప్పుడు అధికారంలోకి రాగానే కాంగ్రెస్లో చేరి కీలక స్థానాలు దక్కించుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకునే ముందు స్థానిక నాయకత్వాన్ని సంప్రదించాలని డిమాండ్ సైతం ఉంది.

గ్రూపు రాజకీయాల భయం...

 ఏకపక్షంగా ప్రోత్సహిస్తే పార్టీ లోపల గ్రూపు రాజకీయాలు పెరిగే ప్రమాదం ఉందని, దీనివల్ల భవిష్యత్తులో రానున్న ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కిందిస్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించకపోతే నిబద్ధత కలిగిన కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.

పాత కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్

పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన కార్యకర్తలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పాత శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పాత, కొత్త నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తేనే జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో స్పష్టత కరువు...!

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష ఎన్నికపై సిర్పూర్ నియోజకవర్గం లో ని ఏడు మండలాలు ఒక మున్సిపాలిటీ అధ్యక్ష పదవుల నియామకం పూర్తి అయినప్పటికీ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని 10 మండలా లలో అధ్యక్ష పదవుల కేటాయింపు పై ఇంకా పీటమూడి విడలేదు. పార్టీ బలోపేతం కో సం సమర్ధులైన నాయకులను ఎన్నుకోవాలని అధిష్టానం భావిస్తుండగా నియోజకవ ర్గంలో అధ్యక్ష పదవుల కేటాయింపు విషయంలో అంతర్గతంగా పోటీలో ఉన్న అభ్య ర్థుల వివరాలను పార్టీ అధిష్టానం గోప్యంగా విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది.