గోషామహ ల్‌లో రూ.4.25 కోట్లతో అభివృద్ధి పనులు
ప్రారంభించిన ఎమ్మెల్యే టీ రాజాసింగ్
పాల్గొన్న స్థానిక నేతలు ఆళ్ల పురుషోత్తంరావు తదితరులు
హైదరాబాద్, మే 15(విజయక్రాంతి): హై దరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం సుమారు రూ.4. 25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీ రాజా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆళ్ల పురుషోత్తం రావు, డీ గోపాల్‌జీ, పండు యాదవ్ జీ కృష్ణ, మాజీ కార్పొరేటర్ శశికళ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆళ్ల పురుషోత్తం రావు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడం లో ముందుంటున్నారని స్థానిక ప్రజలు అభినందించారు.
ఆయన ఆధ్వర్యంలో ప్రాంతం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు.తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించబడనున్నాయని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు.






