పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట మే 15 విజయక్రాంతి): కోనరావుపేట మండలం అజ్మీరాతండా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంత రం వారికి నూతన వస్త్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్ల య్య, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య యాద వ్, గ్రామ సర్పంచి నరేష్ నాయక్, జిల్లా నాయకులు షేక్ ఫిరోజ్ పాషా, చేపూరి గం గాధర్, గొట్టే రుక్మిణి, మార్కెట్ కమిటీ డైరెక్ట ర్లు వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ ప్ర జలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






