18 August, 2026 | 12:29 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి: సీపీఐ

16-05-2026 01:52 AM

ఖమ్మం, మే 15(విజయ క్రాంతి):  మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సేవలో మునిగి సామాన్య ప్రజలపై భారాలు మోపుతుందని ఇందులో భాగంగానే పెట్రోల్, డిజీల్ ధరలు పెంచారని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆరోపించారు. మోడీ ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్నారని చెప్పేదా నికి చేసే దానికి పొంతన లేకుండా పోతుం దని ఆయన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుండి బైపాస్ రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు.

ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన మోడీ హామీలో తుంగలో తొక్కి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని రానున్న కాలంలో నిత్యావసర వస్తువుల ధరలను మరింతగా పెంచను న్నారని తెలిపారు.  మోడీ అధికారంలోకి వచ్చేనాడు పెట్రోల్ ధర రూ.60లు ఉందని ఇప్పుడు రూ. 111 కు చేరుకుందని సురేష్ తెలిపారు.

డీజిల్ సైతం రూ.99లకు చేరుకుందని పెట్రో ధరల పెరుగుదల సామాన్యులకు మరింత భారం కానుంద న్నారు. రవాణా ఛార్జీలు పెరిగి ఇతరత్రా కూడా అదనపు భారం కానుందన్నారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించు కోవాలన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కె జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి, జిల్లా నాయకులు తాటి నిర్మల, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ, వరదా నర్సింహారావు, పోటు పూర్ణ, జ్వాలా నర్సింహారావు, మందా వెంకటేశ్వర్లు, ఉపేందర్, చార్లెస్, బెజవాడ వెంకన్న, నర్సింహారావు రమణయ్య, లడ్డు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.