ప్రజల అవసరాల మీద రాజకీయమా ఛి....!!
5వ వార్డు కౌన్సిలర్ శిల్ప నాగరాజు
జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం 5వ వార్డు కౌన్సిలర్ శిల్ప నాగరాజు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి బిఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వార్డులోని వివేకానంద స్కూల్ నుండి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ఇటీవల డ్రైనేజీ శాంక్షన్ కావడంతో ఆ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది.
ఈ నిర్మాణంలో భాగంగా డ్రైనేజ్ లైన్ తీస్తుండగా జిన్నారంలోని 5వ వార్డు , 4వ వార్డులకు సరఫరా చేసే మంచినీటి పైపులు ధ్వంసం కావడంతో ఈ విషయం సదరు మున్సిపల్ అధికారుల దృష్టికి 5 వ వార్డ్ కౌన్సిలర్ శిల్పా నాగరాజ్ యాదవ్ తీసుకు వెళ్లరు ఈ సందర్భంగా అధికారులు రెండు రోజుల్లో ఆ డ్యామేజ్ ని పునర్మిస్తూము అని తెలిపారని దీని ద్వారా 4వ వార్డు, 5వ వార్డు ప్రజలకు నీటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి వారికి ప్రభుత్వ ట్యాంకర్ ద్వారా నీటిని అందజేయాలని కోరడంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా చేస్తామని చెప్పారు.
ఆదివారం జిన్నారం మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ స్వప్న రాజేందర్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్ కోసం 5వ వార్డులో ప్రభుత్వ ట్యాంకర్ నీళ్లు ప్రజలకు అందిస్తుండగా అక్కడికి వచ్చి ఫోటో దిగి ఐదో వార్డులో నా సొంత నిధులతో నీటి పంపిణీ కార్యక్రమం చేపడుతున్న అని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకోవడం హేయమైన చర్య దీన్ని కౌన్సిలర్ శిల్ప నాగరాజు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు రాజకీయం చేయడం మంచిది కాదు అని ప్రభుత్వ వాహనం ద్వారా నీటిని అందించే కార్యక్రమాన్ని మీ స్వంత నిధులతో చేస్తున్నాం అని చెప్పడం సిగ్గు చేటు అని అన్నారు.






