విద్యుత్ షాక్ తో బర్రె మృతి
24-08-2026 08:24 PM
చేర్యాల,(విజయక్రాంతి): చేర్యాల పట్టణంలో ఉట్లపల్లి వీధిలో సోమవారం సాయంత్రం విద్యుత్ ప్రమాదంతో పాడి బర్రె మృతి చెందింది.బాధిత రైతు అవుచర్ల కిష్టయ్య తనకు చెందిన బర్రె చనిపోవడంతో దాదాపు రూ.లక్ష వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా ముసురుతో కూడిన వర్షం పడటంతో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ జాలి ఏర్పాటు చేయకపోవడంతో భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని,విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ జాలి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.






