25 August, 2026 | 1:11 AM

ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం

24-08-2026 09:39 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామానికి చెందిన కొప్పుల ఇంద్ర అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న కృష్ణసాగర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ భూక్య మోహన్‌రావు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి రూ.3 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తామన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ దివ్య, పిల్లి రవివర్మ, గుర్రం సురేష్, పిల్లి వీరయ్య, గ్రామపెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.