అభివృద్ధి, సంక్షేమ పనులు వేగవంతం చేయాలి
29-08-2026 02:31 AM
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మహబూబ్‌నగర్, ఆగస్టు 28: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలు, ఏ.పీ.ఓలు, హౌసింగ్ ఏఈలతో వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఫామ్ పాండ్లు, సోక్పిట్లు, లేబర్ రిపోర్టులు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, వనమహోత్సవం తదితర కార్యక్రమాల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. పెండింగ్ పనులను ప్రాధాన్యతతో పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.






