31 July, 2026 | 1:11 AM

సెప్టెంబర్ 1లోపు డిమాండ్లు తీర్చాలి

31-07-2026 12:32 AM

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం వంటి ప్రధాన డిమాండ్లను 2026 సెప్టెంబర్ 1లోపు ప్రభుత్వం అమలు చేయాలని, లేనిపక్షంలో పీఆర్‌టీయూటీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు వినతిపత్రం సమర్పించారు.