సమృద్ధిగా వర్షాలు కురవాలి
- ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
- మంత్రులు తుమ్మల, పొన్నం, అడ్లూరి
- భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు
వేములవాడ, జూలై 30(విజయక్రాంతి): సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు. వరుణయాగం అనేది కేవ లం ఆధ్యాత్మిక క్రతువే కాకుండా లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే మహోన్నత వైదిక సంప్రదాయమన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే రైతులు ఆర్థికంగా బలోపే తం అవడంతో పాటు రాష్ట్రం వ్యవసాయరంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని, ప్రజలకు తాగునీటి సమస్యలు తీరడంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా నెలకొంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, తెలంగాణ సస్యశ్యామలంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ఈ వరుణయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గురువారం మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులకు ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, భీమేశ్వర స్వామి ఆలయం లో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్ర భుత్వ విప్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ కుమార్‌లు స్వా మివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.
భీమేశ్వర స్వా మి ఆలయంలో గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం రుశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు యాగశాలలో వరుణయాగాన్ని అధికారికంగా ప్రారంభించారు. భీమేశ్వర సదన్‌లో ఇంకుడు గుంతకు ప్రత్యే క పూజలు నిర్వహించి ప్రారంభించారు.
అనంతరం భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సత్కరించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్క్ ను మంత్రులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. వేములవా డ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులను ప్రారంభించి న మంత్రులు వేములవాడ నుంచి బాసరకు నూతన బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారిరమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు.






