16 April, 2026 | 11:18 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ మృతి..

18-12-2025 04:32 PM

పాపన్నపేట (విజయక్రాంతి): పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైకని శ్రీనివాస్(38) ప్రైవేటు డ్రైవర్ గా పని చేసేవాడు. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నాడు. కాలు విరిగిందని ఏ పని చేయలేక పోతున్నానని తరచూ ఇంట్లో బాధ పడుతుండేవాడు. మనస్తాపం చెందిన అతను జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లాడు. పురుగు మందు సేవించి అవస్థ పడుతుండగా స్థానికులు గమనించి చికిత్స కోసం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య ఎలీషా ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.