1 September, 2026 | 3:19 AM

చేయూత దరఖాస్తులకు గడువు పెంపు

01-09-2026 02:00 AM

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15 వరకు.. 

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): చేయూత సామాజిక భద్రతా(Cheyutha Social Security) పెన్షన్ల(Pensions) కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Seethakka) ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Deadline for receiving applications)ను సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో  కొనసాగుతున్న సర్ ప్రత్యేక ప్రక్రి య కారణంగా పలువురు అర్హులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు(Applications) సమర్పించలేకపోతున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చింది.

ముఖ్యంగా దివ్యాంగులు తమకు మరికొంత సమయం ఇవ్వాలని మంత్రి సీతక్క ను కోరారు. ఈ విజ్ఞప్తులను సానుకూలం గా పరిగణించిన మంత్రి సీతక్క, అర్హులైన ఒక్కరూ కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోకూడదని అ ధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును మరో 15 రోజుల పాటు పెంచుతూ సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులై న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగిన పేద కుటుంబాల వారు సెప్టెంబర్ 15 వరకు తమ దరఖాస్తులను సమర్పించుకునే అవకాశం లభించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... సామాజిక భద్రతా పెన్షన్లు పేద కుటుంబాలకు ప్రభుత్వం అం దిస్తున్న భరోసా అని అన్నారు. అర్హత ఉన్న ఒక్క పేదవాడు, దివ్యాంగుడు సమాచారం లేకనో, ఇతర కారణాల వల్లనో ప్రభుత్వ సంక్షేమ పథకానికి దూరం కాకూడదన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

దివ్యాంగులు తమ సమస్యలను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, వారి అభ్యర్థనను మానవీయ కోణంలో పరిశీలించి గడువు పెంచామని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేయూత పెన్షన్ల విషయంలో ప్ర భుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు. నిజమైన అ ర్హులను గుర్తించి వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

అర్హ త ఉన్న ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడువు పెంపును దృష్టిలో పెట్టుకుని సం బంధిత అధికారులు, సిబ్బంది దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. ము ఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అవసర మైన సహాయం అందించాలని సూచించా రు. సెప్టెంబర్ 15ను తుది అవకాశంగా భా వించి, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.