4 July, 2026 | 2:50 AM

చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్

04-07-2026 01:56 AM

చివ్వెంల, జూలై 3: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్ నియామకాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు. దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న దారావత్ వీరన్న నాయక్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి.

గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దారావత్ వీరన్న నాయక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.