calender_icon.png 11 February, 2026 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

11-02-2026 12:00:00 AM

కల్వర్టులు, స్పీడ్ బ్రేకర్లు లేక నిత్యం రోడ్డు ప్రమాదాలు

అశ్వాపురం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మల్లెల మడుగు మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన ఆర్‌అండ్బీ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మల్లెల మడుగు - నెల్లిపాక బంజర గ్రామాల మధ్య సరిహద్దులోని చింత చెట్టు వద్ద ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అలాగే కాలువల వద్ద సరైన కల్వర్టులు లేకపోవడం వల్ల వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ భద్రాచలం వైపు వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ ఆర్‌అండ్బీ శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, కాలువల వద్ద కల్వర్టులు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.