10-02-2026 08:00:50 PM
పశు సంపదను పెంచండి.. తాజా పాలను సేవించండి
గరిడేపల్లి,(విజయ క్రాంతి): పాడి పశువుల పెంపకంతో రైతులకు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ ప్రజలు తాజా పాలను సేవించి ఆరోగ్యవంతంగా ఉండవచ్చునని గానుగబండ గ్రామ సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య అన్నారు.మండలంలోని గానుబండ గ్రామంలో పశువులకు వైద్యానికి అనుకూలంగా ఉండటానికి నూతన పశువుల బోనును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువులు ఉన్న ప్రతి ఒక్కరు దీని వినియోగించుకుని పశువుల టీకాలు వేసే సమయంలో గాని ఇంజక్షన్లు ఇవ్వటానికి గాని పశువుల క్యాంపులు ఏర్పాటు చేసేటప్పుడు ఈ పశువుల బోను ఉపయోగపడుతుందని దీనిని పశువులు ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సయ్యద్ నాగుల్ మీరా,గ్రామపంచాయతీ కార్యదర్శి శివ,గోపాలమిత్ర గోపి,వార్డు నెంబర్లు గ్రామ పెద్దలు పాడి రైతులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు