calender_icon.png 11 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో సీఎం కప్ సెకండ్ ఎడిషన్

11-02-2026 12:00:00 AM

  1. పవర్ లిఫ్టింగ్ జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు

జిల్లా జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి

భద్రాచలం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో భాగంగా  మంగళవారం భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సెంటర్ నందు జిల్లాస్థాయి  పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, స్థానిక సర్పంచ్ పూనెం కృష్ణ, విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి అనంతరం వారు మాట్లా డుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో ఉన్న  ప్రతిభను వెలికి  తీసి ప్రపంచ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే లక్ష్యం దిశగా  ఆయన ఈ సీఎం కప్  పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ  భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి ఏజెన్సీ ఏరియాలో పవర్ లిఫ్టింగ్ రంగంలో  అనేక సంవత్సరాలుగా ఎంతోమంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలలో   కాకుండా మూడం వంశి అనే గిరిజన క్రీడాకారుడిని ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా  గెలుపొందడానికి  అవసరమైన శిక్షణ,

ఆర్థిక లావాదేవీలను కూడా  సమకూర్చి ఇంటర్నేషనల్ పోటీలలో బంగారు పతకాలు  సాధించేలా చేసి తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను  పెంచే విధంగా కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భద్రాచలం సిటీ స్టేల్ జిమ్ కోచ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రెటరీ  జివి రామిరెడ్డి  అని సందర్భంగా తెలియజేస్తున్నాను.  భద్రాచలం సిటీ జిమ్ 73 సంవత్సరాల పవర్ లిఫ్టింగ్   క్రీడాకారుడు  డివి శంకర్రావు , గుండెకు బైపాస్ సర్జరీ అయినప్పటికీ లెక్కచేయకుండా  శరీరానికి వయసు అడ్డు కాదని నిరూపించిన అటువంటి వ్యక్తి డివి శంకర్రావు  అని తెలిపారు .

అంతేకాకుండా  బెస్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ సంస్థ, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ, గ్రేట్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ, ఇప్పటివరకు ఈ మూడు సంస్థలు  ఇండియాలో బైపాస్ అయిన  73 సంవత్సరాల వయసులో 4 బంగారు పతకాలు సాధించిన వ్యక్తిగా  డివి శంకర్రావు గారు అద్భుత ప్రతిభను కనబడుటమే కాకుండా  తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీర్తిని తెచ్చి పెట్టారు అని చెప్పి తెలిపారు.

అతనికి కఠోర శిక్షణ ఇచ్చినటువంటి  కోచ్ జివి రామిరెడ్డి ని  ప్రశంసించారు.  ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, స్థానిక సర్పంచ్,  పూనెం కృష్ణ, మహంతి వెంకటకృష్ణాజి, అబ్దుల్ ఫరూఖ్, డివి శంకర్రావు, కావేటి రమేష్, కోమండ్ల వేణు, మామిడి భూమిక, నిశాంత్, పవన్ మరియు జిల్లా క్రీడాకారులు, పాల్గొనడం జరిగింది.