‘పాతాళ గంగ’లో 3వేల సిలిండర్లు
- ముంబైలో కూలిన హెచ్‌పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ గోడ
- ప్లాంట్‌లోకి పోటెత్తిన వరద
ముంబై, జూలై 9 (విజయక్రాంతి): ముంబైలో భారీ వర్షాలకు హెచ్‌పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ గోడ కూలిపోయింది. దీంతో ప్లాంట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. 3వేల సిలిండర్లు పాతాళ గంగ నది వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అలా కొట్టుకుపోయి ఒడ్డుకు వచ్చిన సిలిండర్లు పేలే ఆస్కారం ఉండడంతో అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది.
రాయగఢ్ కలెక్టర్ కిషన్ జావ్లే మాట్లాడుతూ.. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సిలిం డర్ల వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దని, స్థానిక అధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. వాటిలో గ్యాస్ ఉం దో, లేదో, వరదల కారణంగా అవి లీక్ అయ్యే ప్రమాదం ఉందని, వాటికి దూ రంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. నదిలో కొట్టుకుపోయిన సిలిండర్లను స్వాధీనం చేసుకునేందుకు చర్య లు చేపట్టామని కలెక్టర్ వివరించారు.






