4 July, 2026 | 2:44 AM

సైబరాబాద్ పోలీస్ ‘ఆపరేషన్ ముస్కాన్-12 ప్రారంభం

04-07-2026 12:42 AM

శేరిలింగంపల్లి, జూలై 3 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం. రమేష్ అధ్యక్షతన సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ’ఆపరేషన్ ముస్కాన్-12 కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించారు. జూలై 1 నుంచి 31 వరకు నెలరోజుల పాటు అమలు చేసే ఈ ఆపరేషన్ ద్వారా మిస్సింగ్ చిల్డ్రన్, బిచ్చగాళ్లు, రాగ్ పిక్కింగ్, బాల కార్మికులు, బాల వ్యాపారబంధిత శ్రమలో ఉన్న పిల్లలను గుర్తించి రక్షించి, పునరావాసం కల్పించనున్నారు.

దీనికోసం 7 స్పెషల్ టీములు ఏర్పాటు చేసి హాట్స్పాట్స్లో తనిఖీలు నిర్వహిస్తారు.డార్పణ్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి మిస్సింగ్ పిల్లలను గుర్తించి కుటుంబాలతో పునర్విలయం చేస్తారు. ఈ ఆపరేషన్ను ఎస్‌ఎంటి,కె. శ్రుజన, డీసీపీ (మహిళలు శిశు సంక్షేమ విభాగం) పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అన్ని సంబంధిత శాఖలు పూర్తి సహకారం అందిస్తామని మీటింగ్లో హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.