15-02-2026 12:41:54 PM
నాగర్ కర్నూల్/శ్రీశైలం,(విజయక్రాంతి): శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా ఆదివారం తెల్లవారుజాము నుండి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవస్థాన అధికారులు దర్శన ఏర్పాట్లు, క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదం వంటి సదుపాయాలను సమకూర్చారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. భక్తులు సహనం పాటిస్తూ, అధికారుల సూచనలు అనుసరించాలని అధికారులు కోరుతున్నారు.