calender_icon.png 15 February, 2026 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ జిల్లాస్థాయి ఖోఖో ఛాంపియన్స్ వీరే

15-02-2026 12:38:18 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాయ్స్ హై స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ జిల్లా స్థాయి ఖోఖో క్రీడా పోటీలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. హాజీపూర్ మండలం ముల్కల్లలో కొనసాగుతున్న మంచిర్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యార్థులు పోటీలలో పాల్గొని ఖోఖోలో మొదటి స్థానంలో నిలిచి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీద బహుమతి అందుకున్నారు. రాష్ట్రస్థాయి సెలక్షన్ల లో ఒక జిల్లా నుంచి తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఆడాల్సి ఉండగా, మంచిర్యాల గురుకుల పాఠశాలకు చెందిన ఎస్ విష్ణువర్ధన్, ఏ అఖిల్, ఎస్ సాయి ప్రసాద్, జీ ప్రణయ్ లు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 20 నుంచి 24 వరకు నల్గొండ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ కే. మోహన్ , వైస్ ప్రిన్సిపాల్ కే. మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ కే. రమేష్, అలాగే హౌస్ మాస్టర్స్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు కుమ్మరి శ్రీకాంత్(పిడి), మారేపాక సాగర్ (పిఈటి)లు అభినందించారు.