17 July, 2026 | 2:09 AM

వర్షాభావంతో ఎండిపోతున్న వరి పంటలు..

17-07-2026 01:57 AM

రైతుల్లో ఆందోళన

బోధన్, జూలై 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలంపాడ్ గ్రామ శివారులో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో వరి పంటలు ఎండిపోతుండటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల నాట్లు వేసిన పంటలు నీటి కొరత కారణంగా వాడిపోతుండడంతో పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అవుతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువులు, కాలువలు నిండకపోవడం, భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడంతో సాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో బోర్లు కూడా ఎండిపోవడంతో పంటలను కాపాడుకోవడం రైతులకు కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అలాగే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.