18 May, 2026 | 3:05 AM

రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై క్రిమినల్ కేసులు

18-05-2026 02:10 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి 

నంగునూరు, మే 17: ధాన్యం కొనుగోళ్లో రైస్ మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తే క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా,వారి లైసెన్సులు రద్దు చేసి మిల్లులను మూసివేయిస్తామని నంగునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి హెచ్చరించారు. ఆదివారం ఆయన ఖాతా, గట్లమల్యాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మిల్లర్ల తీరుపై రైతులు ఫిర్యాదు చేయడంతో.. ఈ సమస్యను ఇంచార్జి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి చివరి గింజనూ కొనుగోలు చేస్తుందని,ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లూరు సోనీ మహేష్,డైరెక్టర్ గాండ్ల రమేష్,స్థానిక నాయకులు బాగు శ్రీకాంత్,తుపాకుల శ్రీనివాస్,చల్లా శ్రీనివాస్ రెడ్డి,ఆరేపల్లి సురేష్,పంగ రాజశేఖర్ రెడ్డి,మహదేవ్,ఈజాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.