భట్రాజ్ సంఘం జిల్లా అధ్యక్షునిగా అడ్లూరి కృష్ణంరాజు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 17 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని సంధ్యా కాంప్లెక్స్లో ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా భట్రాజ్ సంఘం, యువజన , మహిళా విభాగాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. రాష్ట్ర భట్రాజ్ సంఘం నాయకులు, జిల్లా ఎన్నికల అధికారి చెన్నమాధవుని శ్రీరామరాజు, ఎన్నికల పర్యవే క్షణ అధికారి నన్నపురాజు మనోజ్రాజు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా భట్రాజ్ సంఘం అధ్యక్షుడిగా అడ్లూరి కృష్ణంరాజు, ప్రధాన కా ర్యదర్శిగా అడ్లూరి జగన్నాథరాజు, కోశాధికారిగా సరికొండ శ్రీనివాస్రాజు, గౌరవ అధ్య క్షుడిగా తుమికి శ్రీహరిరాజు, ముఖ్య సలహాదారుడిగా బొల్లెపల్లి ప్రసాద్రాజు ఎన్నిక య్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా నీలకంఠం సుధాకర్రాజు, సంయుక్త కార్యదర్శిగా అడ్లూ రి నరేందర్రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సరస్వతి సత్యనారాయణరాజు, కార్యవర్గ సభ్యులుగా సరస్వతి శ్రీనివాస్రాజు, తుమికి వంశీరాజులను ఎన్నుకున్నారు.
యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా తంగెళ్ల సాయిప్రసాద్రాజు, ప్రధాన కార్యదర్శిగా సరికొండ రేవంత్రాజు, ఉపాధ్యక్షుడిగా ఎర్రం సాయిరాజు, సంయుక్త కార్యదర్శిగా ఎర్రం రా మరాజు ఎన్నికయ్యారు.మహిళా విభాగం జి ల్లా అధ్యక్షురాలిగా కాసు వీణాదేవి, ప్రధాన కార్యదర్శిగా తంగెళ్ల సరోజ, ఉపాధ్యక్షురాలిగా ఎర్రం లక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా నీలకంఠం స్వర్ణలత, కోశాధికారిగా సరస్వతి నాగాంజలి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సరికొండ శైలజ, కార్యవర్గ సభ్యులుగా అడ్లూరి పూజ, నీలకంఠం అభినయశ్రీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.






