ఖాజాపూర్‌లో భారీ వర్షాలకు ఇల్లు కూలింది
30-07-2026 06:52 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఓ నివాస గృహం కూలిపోయింది. ఇంటి శ్లాబ్, రేకులు, గోడలు నేలమట్టమయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుగానే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.






