21 July, 2026 | 8:10 AM

రైతులకు ఎల్నీనో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

20-07-2026 06:03 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట గ్రామ రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎల్నీనో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, బోరు బావుల రీఛార్జ్ స్ట్రక్చర్ల ఏర్పాటుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్నీనో పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ చర్యలు, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, బోరు బావుల రీఛార్జ్ విధానాలపై రైతులకు నిపుణులు వివరించనున్నారు.గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.